Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడు బాక్సాఫీస్ ప్లేయర్.. మూడు ఫార్మాట్లు ఆడించాలి: అశ్విన్

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ బాక్సాఫీస్ ప్లేయర్ అని, అతని ఆటను మూడు ఫార్మాట్లలో చూడాలని ఉందని తెలిపాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడి కోసం జనాలు స్టేడియానికి పోటెత్తుతారని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో పవర్ ప్లేలో 30 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. శనివారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడాడు.

మూడు ఫార్మాట్లు ఆడించాలి..

230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ వంటి పేసర్లను నిర్భయంగా ఎదుర్కొన్నాడు. అయితే రషీద్ ఖాన్(4/33) సంచనల ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 152 పరుగులకే కుప్పకూలి 77 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడినా.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు అశ్విన్ ఫిదా అయ్యాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'వైభవ్ సూర్యవంశీ ప్రతి బౌలర్‌ను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. అతన్ని టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు ఫార్మాట్ల క్రికెట్‌లో చూడాలని ఉంది. ప్రజలు అతడిని చూడటానికి క్రికెట్ మైదానాలకు పోటెత్తుతారు. ఎందుకంటే వారిని అతను తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తాడు.

IPL 2026 R Ashwin Hails Vaibhav Sooryavanshi s Rare Talent as A Three-Format Box Office Player

బాక్స్ ఆఫీస్ ప్లేయర్..

అతను స్క్రీన్ వేవ్ స్టార్. అయితే వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు పెట్టుకోవద్దు. అతను తన పూర్తి శక్తిని ఉపయోగించి బంతిని బాదుతాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో అతను ఆడిన తీరు గొప్ప 'బాక్స్ ఆఫీస్’ ప్లేయర్‌గా నిరూపించింది. క్రికెట్ కెరీర్‌లో ఆటను ఆస్వాదించే సందర్భాలు చాలా తక్కువ. అతనికి ఇప్పుడు 15 ఏళ్లే. అతన్ని స్వేచ్ఛగా ఆడనిద్దాం. ఈ సమయంలో అతను చేయకూడనిది చేయమని చెప్పి లాభం లేదు.

రాజస్థాన్ జట్టులో ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా వంటి అనుభవజ్ఞులైన మిడిలార్డర్ ఉండటం వైభవ్ సూర్యవంశీకి కలిసొస్తుంది. అతను ఒత్తిడి మోయాల్సిన అవసరం లేదు. అతను మంచి ఆరంభాన్ని అందిస్తే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లను సులువుగా గెలుస్తుంది.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 10, 2026, 16:52 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+