Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయ్యో.. సాయి సుదర్శన్! మళ్లీ ఇలా ఔటయ్యావేంటి..? (వీడియో)

గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను మళ్లీ దురదృష్టం వెంటాడింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఈ గుజరాత్ ఓపెనర్ దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన క్వాలిఫయర్ 1లోనూ హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్.. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లోనూ అలానే వెనుదిరిగాడు.

బ్రిజేష్ శర్మ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ ఐదో బంతిని బ్రిజేష్ శర్మ ఫుల్‌టాస్‌గా వేయగా.. సాయి సుదర్శన్ ఆఫ్‌సైడ్ స్లైస్ చేశాడు. బంతి బౌండరీ వైపు వెళ్లగా.. అతని చేతిలో నుంచి జారిన బ్యాట్‌ నేరుగా వికెట్లపై పడింది. దాంతో సాయి సుదర్శన్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

ఫెవికాల్ ఎక్కడ, బంక జిగురు? ఎక్కడ అని రవిశాస్త్రి తన వ్యాఖ్యానంలో ప్రశ్నించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌ అయిన తొలి బ్యాటర్‌గా సాయి సుదర్శన్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ అయ్యో.. సాయి సదుర్శన్ అని కామెంట్ చేస్తున్నారు.

IPL 2026 Qualifier 2 Sai Sudharsan Suffers again Unfortunate Hit-Wicket Dismissal During GT vs RR

సాయి సుదర్శన్ హిట్ వికెట్‌తో తొలి వికెట్‌కు నమోదైన 167 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదగా.. శుభ్‌మన్ గిల్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96) చెలరేగగా.. రవీంద్ర జడేజా(45 నాటౌట్), డోనవన్ ఫెరీరా(38 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, May 29, 2026, 23:14 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+