Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: బుడ్డోడి కష్టం బుగ్గిపాలు.. ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌‌‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ సత్తా చాటింది.

IPL 2026: చెలరేగిన బేబీ బాస్.. 11 ఏళ్ల రికార్డ్ ఫసక్!

IPL 2026: చెలరేగిన బేబీ బాస్.. 11 ఏళ్ల రికార్డ్ ఫసక్!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96) చెలరేగగా.. రవీంద్ర జడేజా(45 నాటౌట్), డోనవన్ ఫెరీరా(38 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ తలో వికెట్ పడగొట్టారు.

IPL 2026 Qualifier 2 Gujarat Titans Storm Into the Final Vaibhav Sooryavanshi s Blistering 96 in Vain as RR Knocked Out

శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్..

అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104) సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ ఇద్దరూ 167 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ తీసారు. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం జరిగే ఫైనల్లో ఆర్‌సీబీతో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

అయ్యో.. సాయి సుదర్శన్! మళ్లీ ఇలా ఔటయ్యావేంటి..? (వీడియో)

అయ్యో.. సాయి సుదర్శన్! మళ్లీ ఇలా ఔటయ్యావేంటి..? (వీడియో)

బుడ్డోడి కష్టం బుగ్గిపాలు

ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. టాపార్డర్ బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. వెనువెంటనే వికెట్లు కోల్పోయినా.. వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

31 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఈ బేబీ బాస్.. మరో 15 బంతుల్లోనే 96 పరుగులకు చేరుకున్నాడు. కానీ రబాడ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి మరోసారి 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. వైభవ్ కాసేపు క్రీజులో ఉన్నా.. పవర్ ప్లేలో సరైన సహకారం లభించినా ఫలితం మరోలా ఉండేది.

Story first published: Friday, May 29, 2026, 23:38 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+