Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: వాషింగ్టన్ సుందర్ ఘోర తప్పిదం.. థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ!

గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న కీలక క్వాలిఫయర్-1లో వాషింగ్టన్ సుందర్ ఘోర తప్పిదంతో ఆర్‌సీబీకి అప్పనంగా 4 పరుగులు వచ్చాయి.

విరాట్ కోహ్లీని రనౌట్ చేయాలనే ఆతృతలో బ్యాకప్ ఫీల్డర్‌ను గమనించకుండా సుందర్ బంతిని విసిరాడు. దాంతో ఆ బంతి బౌండరీకి వెళ్లింది. వెంటనే వాషింగ్టన్ సుందర్‌కు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. కోహ్లీకి థ్యాంక్స్ చెప్పిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

IPL 2026 Qualifier 1 Virat Kohli Survives Run-Out Thanks Washington Sundar for Overthrow Boundary vs GT

జాసన్ హోల్డర్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని విరాట్ కోహ్లీ ఆఫ్ సైడ్ ఆడి రిస్కీ సింగిల్ తీసాడు. కవర్స్‌లో ఉన్న సుందర్ బంతిని అందుకొని బౌలర్‌వైపు ఉన్నవికెట్ల‌ను హిట్ చేసే ప్రయత్నం చేశాడు. వికెట్లను మిస్సైన బంతి.. బ్యాకప్ ఫీల్డర్ లేకపోవడంతో బౌండరీ వెళ్లిపోయింది.

అయితే బంతి వికెట్లను తాకి ఉంటే కోహ్లీ రనౌటయ్యేవాడు. బంతి బౌండరీ వెళ్లిన వెంటనే కోహ్లీ.. సుందర్‌కు థ్యాంక్స్ అంటూ సైగలు చేశాడు. అప్పనంగా 4 పరుగులు ఇవ్వడంతో పాటు రనౌట్ చేయనందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీని జాసన్ హోల్డర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కోహ్లీ వెనుదిరిగినా రజత్ పాటిదార్ చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ(2/54), జాసన్ హోల్డర్(2/39) రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ(1/53) ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, May 26, 2026, 20:40 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+