IPL 2026 Qualifier 1: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ ప్రభావం ఉంటుంది. అందుకే లక్ష్యం ఎంత ఉందో చూసుకుంటూ.. ఛేజ్ చేయడం మంచిది. ఈ మ్యాచ్ సమీకరణాల గురించి ఆలోచించకుండా కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం. మేం గత కొన్ని మ్యాచ్‌లుగా చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఆ ప్రదర్శనను ఇక్కడ కూడా కొనసాగిస్తామని ఆశిస్తున్నాం.
నేను ఇక్కడ అండర్-14, అండర్-16 రోజుల్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఈ గ్రౌండ్‌లో నాకు మంచి అనుభవం ఉంది. అది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ప్రపంచంలోనే అత్యంత అందమైన మైదానాల్లో ఇది ఒకటి. మా జట్టులో ఒక మార్పు ఉంది. అర్షద్ ఖాన్ స్థానంలో కుల్వంత్ జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

భారీ లక్ష్యాన్ని నమోదు చేసే ప్రయత్నం చేస్తామని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. పిచ్ బాగుందని, 40 ఓవర్ల పాటు ఒకేలా ఉంటుందని చెప్పాడు. 'ఈ పిచ్ చాలా బాగుంది. ఇది చాలా హార్డ్‌గా ఉంది. బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది. కాబట్టి 40 ఓవర్ల పాటు పిచ్ స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నా. అందుకే బోర్డుపై భారీ లక్ష్యాన్ని నమోదు చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టడానికి ప్రయత్నిస్తాం.
తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ అనేది చాలా కీలకమైనది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు వెళ్లే అద్భుతమైన అవకాశం ఉంటుంది. కానీ మేం ప్రస్తుతానికి మ్యాచ్ బై మ్యాచ్ మాత్రమే ఆలోచిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. మేం ఈ సీజన్ అంతా మంచి క్రికెట్ ఆడాం. ప్రత్యర్థి జట్టు గురించి ఎక్కువగా ఆలోచించడం కంటే మా బలాలు ఏంటనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. మా బలాలపైనే దృష్టి పెట్టడం ఈ ఏడాది మా నినాదం. పిచ్ చాలా బాగుంది. ఎలాంటి గట్టి లేదు కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications