Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఏం బ్యాడ్ లక్ బాసూ.. కనీ వినీ ఎరుగని వికెట్ (వీడియో)

గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ దురదృష్టకర రీతిలో వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే కని వినీ ఎరుగని రీతిలో హిట్ వికెట్ అయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌కు కలిసి రాలేదు.

వరుస బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన సాయి సుదర్శన్ బంతిని బౌండరీకి తరలించే క్రమంలో బ్యాట్‌ను వదిలేసాడు. అది కాస్త గాల్లో పల్టీలు కొట్టి వికెట్లపై పడింది. సగం క్రీజు ధాటిన తర్వాత ఈ విషయాన్ని గమనించిన సాయి సుదర్శన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు.

IPL 2026 Qualifier 1 Sai Sudharsan Suffers Unfortunate Hit-Wicket Dismissal During GT s Chase vs RCB

జాకోబ్ డఫీ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ మూడో బంతిని సాయి సుదర్శన్.. పాయింట్ దిశగా బౌండరీ తరలించాడు. అయితే ఈ షాట్ పూర్తి చేసే క్రమంలో బ్యాట్ అతని చేతిలో నుంచి కిందపడి బౌన్స్ అయ్యి వికెట్లను తాకింది. షాట్ ఆడిన సాయి సుదర్శన్ పరుగు కోసం హాఫ్ క్రీజు ధాటాడు. బంతి బౌండరీ వెళ్లడం గమనించి వెనక్కి తిరగ్గా.. బ్యాట్‌ వికెట్లపై పడటం చూసి అవాక్కయ్యాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. పాపం సాయి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ(2/54), జాసన్ హోల్డర్(2/39) రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ(1/53) ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, May 26, 2026, 22:43 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+