IPL 2026: కొంపముంచిన కగిసో రబాడ.. చరిత్రసృష్టించిన ఆర్‌సీబీ!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ధర్మశాల వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కెప్టెన్ రజత్ పాటిదార్(33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ(2/54), జాసన్ హోల్డర్(2/39) రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ(1/53) ఒక వికెట్ పడగొట్టాడు.
గుజరాత్ టైటాన్స్ రికార్డ్ బద్దలు..
ఈ భారీ స్కోర్‌తో గుజరాత్ టైటాన్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్లే ఆఫ్స్ స్కోర్ రికార్డ్‌ను ఆర్‌సీబీ అధిగమించింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 233/3 స్కోర్ చేసింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా కూడా ఆర్‌సీబీ నిలిచింది. ఓవరాల్‌గా ఆర్‌సీబీకి ఇది మూడో అత్యధిక స్కోర్.

ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్‌లో నమోదైన అత్యధిక జట్టు స్కోర్లు (టోటల్స్):
254/5 - ఆర్‌సీబీ వర్సెస్ జీటీ, ధర్మశాల (2026) *
233/3 - జీటీ వర్సెస్ ఎంఐ, అహ్మదాబాద్ (2023)
228/5 - ఎంఐ వర్సెస్ జీటీ, న్యూ చండీగఢ్ (2025)
226/6 - పీబీకేఎస్ వర్సెస్ సీఎస్‌కే, వాంఖడే (2014)
222/5 - సీఎస్‌కే వర్సెస్ డీసీ, చెన్నై (2012)
ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన మ్యాచ్‌లు:
38 - ఆర్‌సీబీ వర్సెస్ జీటీ, ధర్మశాల (2026) *
33 - సీఎస్‌కే వర్సెస్ డీసీ, చెన్నై (2012)
32 - పీబీకేఎస్ వర్సెస్ సీఎస్‌కే, వాంఖడే (2014)
31 - జీటీ వర్సెస్ ఎంఐ, అహ్మదాబాద్ (2023)
31 - ఎంఐ వర్సెస్ జీటీ, న్యూ చండీగఢ్ (2025)
కొంపముంచిన రబాడ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. వెంకటేశ్ అయ్యర్(19) విఫలమైనా.. దేవదత్ పడిక్కల్(30) కలిసి దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలోనే ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీని రబాడ క్లీన్ బౌల్డ్ చేయగా.. మరుసటి బంతికే దేవదత్ పడిక్కల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో ఆర్‌సీబీ కాస్త ఒత్తిడికి గురైంది.
కృనాల్ పాండ్యా, రజత్ పాటిదార్ జట్టును ఆదుకున్నారు. అయితే 14, 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రజత్ పాటిదార్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు వదిలేసారు. ప్రసిధ్ కృష్ణ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రజత్ పాటిదార్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కుల్వంత్ వదిలేయగా.. మూడో బంతికి ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రబాడ అందుకోలేకపోయాడు. ఈ అవకాశాలతో పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే ఆర్‌సీబీ కష్టాల్లో పడేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications