For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs DC: పాపం.. పృథ్వీ షా, అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే!

ఐపీఎల్ 2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్, టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు తీవ్ర నిరాశే ఎదురైంది. అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. పృథ్వీ షా ఢిల్లీకి ఆడుతున్నాడు.

ఈ ఇరు జట్లు లక్నో వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఇరు జట్ల తుది జట్లలో పృథ్వీ షా, అర్జున్ టెండూల్కర్ పేరు లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగడంతో పృథ్వీ షా ఉద్వాసనకు గురయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో కూడా ఈ ఇద్దరి పేర్లు లేవు. ఈ సీజన్‌లో వారు పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IPL 2026 Prithvi Shaw and Arjun Tendulkar Benched for High-Voltage LSG vs DC Clash in Lucknow

ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ అతని కనీస ధర రూ.30 లక్షలకు ట్రేడ్ చేసుకుంది. మరోవైపు పృథ్వీ షాను అతని కనీస ధర రూ. 70 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గతేడాది ఐపీఎల్‌ వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర తరఫున నిలకడైన ప్రదర్శన కనబర్చడంతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

తుది జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కుతుందని అంతా భావించగా.. పాతుమ్ నిస్సంకను తీసుకొని ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనే కసితో పృథ్వీ షా ఉన్నాడు. ఇటీవలే ఓ ఇంటివాడైన అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్‌లో సత్తా చాటి తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. కానీ అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

లక్నో సూపర్ జెయింట్స్:

ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్.

ఢిల్లీ క్యాపిటల్స్:

కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముఖేష్ కుమార్.

Story first published: Wednesday, April 1, 2026, 20:13 [IST]
Other articles published on Apr 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+