IPL 2026: కోహ్లీ వికెట్ తీసిన బౌలర్‌కు భారత జట్టులో చోటు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు జాక్‌పాట్ లభించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న అప్‌కమింగ్ మూడు వన్డేల సిరీస్‌కు ఈ లక్నో పేసర్ పేరును భారత సెలెక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత్ ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్షన్ కమిటీ మే 19న సమావేశం కానుంది.
ఈ సిరీస్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. హర్షిత్ రాణా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడంతో.. ఐపీఎల్ 2026 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రిన్స్ యాదవ్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వన్డే ప్రపంచకప్ 2027 కోసం భారత పేస్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం.

కుడిచేతి వాటం పేసర్ అయిన ప్రిన్స్ యాదవ్.. ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి టాప్ వికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని బౌలింగ్ సగటు 24.00 కాగా, ఎకానమీ రేటు 8.53గా ఉంది. ఈ ప్రదర్శన అతని బౌలింగ్ నాణ్యతను, ఒత్తిడిలో రాణించే సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.
ఐపీఎల్‌కు ముందు దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26లోనూ ప్రిన్స్ యాదవ్ సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున అతను 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసాడు. ఈ టోర్నీలో టాప్-5 వికెట్ టేకర్‌గా నిలిచాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సీమ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌తో ప్రిన్స్ యాదవ్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు.
క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఇప్పటికే రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 1-2తో ఓటమిని చవిచూసింది. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌తో 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి. అఫ్గానిస్థాన్‌తో భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 6న ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నై నగరాల్లో వన్డే సిరీస్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications