Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ఆర్‌సీబీదే టైటిల్!

ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) దుమ్మురేపుతోంది. 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 18 పాయింట్స్‌తో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ వేదికగా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆర్‌సీబీ అగ్రస్థానానికి వచ్చే ముప్పు ఏం లేదు. ఎందుకంటే ఆర్‌సీబీ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. మరీ చిత్తుగా ఓడితే తప్పా ఆర్‌సీబీ టాప్ ప్లేస్ గల్లంతవ్వదు.

సన్‌రైజర్స్ క్వాలిఫైయర్-1 చేరాలంటే..?

సన్‌రైజర్స్ క్వాలిఫైయర్-1 చేరాలంటే..?

అయితే ఐపీఎల్‌లో గత ఐదేళ్లుగా కొనసాగిన సెంటిమెంట్ రీపిట్ అయితే ఈసారి ఆర్‌సీబీ టైటిల్ అందుకుంటుంది. ఎందుకంటే గత ఐదు సీజన్లలో టాప్-2 టీమ్స్ మాత్రమే విజేతగా నిలిచాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. 2021 సీజన్‌లో టేబుల్ రన్నరప్ సీఎస్‌కే టైటిల్ అందుకుంది.

IPL 2026 Prediction Historic Top-2 Playoff Sentiment Points to Back-to-Back Trophy Glory for RCB

ఐపీఎల్ 2022 సీజన్‌లో మళ్లీ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవగా.. 2023 సీజన్‌లో రన్నరప్ సీఎస్‌కే టైటిల్ అందుకుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో టేబుల్ టాపర్ కేకేఆర్ టైటిల్ అందుకోగా.. 2025 సీజన్‌లో టేబుల్ రన్నరప్ ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. గత ఐదేళ్లుగా ఒక సీజన్ టేబుల్ టాపర్ గెలిస్తే.. మరుసటి సీజన్ టేబుల్ రన్నరప్ గెలిచింది. ఈ లెక్కన గతేడాది టేబుల్ రన్నరప్ అయిన ఆర్‌‌సీబీ విజేతగా నిలవగా.. ఈ సారి టేబుల్ టాపర్‌కు టైటిల్ వరిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. మరీ ఈ సెంటిమెంట్‌కు రిపీట్ అవుతుందా? లేక బ్రేక్ పడుతుందా? అనేది మే 31న తేలనుంది.

IPL 2026 Prediction Historic Top-2 Playoff Sentiment Points to Back-to-Back Trophy Glory for RCB

2016 సెంటిమెంట్ రిపీట్ అయితే..?

ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఆ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలవగా.. ఆర్‌సీబీ టాప్-2 నిలిచింది. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. కాకతాలియమో ఏమో కానీ తాజా సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలోనే నిలవగా.. ఆర్‌సీబీ టాప్-2లో ఉంది. మరోసారి 2016 సీజన్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఆరెంజ్ ఆర్మీ టైటిల్ అందుకుంటుందా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.

 రుతురాజ్‌పై బూతుల వర్షం.. సీఎస్కే ఫ్యాన్స్‌పై అశ్విన్ ఫైర్!

రుతురాజ్‌పై బూతుల వర్షం.. సీఎస్కే ఫ్యాన్స్‌పై అశ్విన్ ఫైర్!
Story first published: Friday, May 22, 2026, 17:32 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+