IPL 2026: లక్నో చేతిలో ఓటమి.. డేంజర్ జోన్‌లో RCB
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి మరో ఓటమి ఎదురైంది. అద్వితీయమైన ప్రదర్శనతో దుమ్మురేపిన ఆర్‌సీబీ అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ వరుస ఓటములతో ఆర్‌సీబీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 4 మ్యాచ్‌ల్లో కనీసం 2 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే ఈ నాలుగు మ్యాచ్‌లను ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియంలో కాకుండా ఇతర మైదానాల్లో ఆడనుంది. ఇదే ఇప్పుడు ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతోంది.

అంతేకాకుండా ముంబై ఇండియన్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా ఉన్నాయి. టోర్నీ ఆరంభంలో ఇబ్బంది పడిన ముంబై, కేకేఆర్ అనూహ్యంగా పుంజుకున్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుంది. మూడు గెలిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అగ్రస్థానంలో నిలవాలంటే నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిస్తేనే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలుస్తోంది. మూడు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఫిల్ సాల్ట్ గాయంతో జట్టుకు దూరం కావడం ఆర్‌సీబీకి నష్టం చేస్తోంది.
ఫిల్ సాల్ట్ గైర్హాజరీలో బరిలోకి దిగిన జాకోబ్ బెతెల్ తడబడుతున్నాడు. అతని వైఫల్యం మరో ఓపెనర్ విరాట్ కోహ్లీపై ప్రభావం చూపుతోంది. దాంతో ఆర్‌సీబీ వరుస మ్యాచ్‌ల్లో ఓడింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ ఆర్‌సీబీకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ఆర్‌సీబీపై ఒత్తిడి తగ్గుతోంది. లేదంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇతర మ్యాచ్‌లపై ప్రభావం పడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications