Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 ప్లే ఆఫ్స్ సమరం: 3 బెర్తులు.. 7 జట్ల పోటీ!

ఐపీఎల్ 2026 సీజన్‌ ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. టేబుల్ టాపర్‌గా ఆర్‌సీబీ ఒక బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. మరో మూడు ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో ఐదు జట్లకు ఎక్కువ అవకాశాలు ఉండగా.. మరో రెండు జట్లకు తక్కువ ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు ఏ జట్టుకు ఎలా ఉన్నాయో ఓ లుక్కెద్దాం.

1.ఆర్‌సీబీ

62 లీగ్ మ్యాచ్‌లు ముగిసే సరికి ఆర్‌సీబీ 18 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మరో విజయం సాధిస్తే టాప్-2 బెర్త్ ఖరారు అవుతుంది.

2. గుజరాత్ టైటాన్స్..

16 పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ కూడా దాదాపు ఖరారైంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు 99.20 శాతంగా ఉన్నాయి. మరో విజయం సాధిస్తే టాప్-2 బెర్త్ ఖారారయ్యే అవకాశం ఉంది.

IPL 2026 Playoff Scenarios The Race for Remaining Slots After RCB Qualifies MI and LSG Exit

3. సన్‌రైజర్స్ హైదరాబాద్..

14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 75 శాతం అవకాశాలు ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది. ఒక మ్యాచ్‌లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. ఓడితే మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఆర్‌సీబీతో ఆఖరి మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది.

ఆ తెలుగు హీరోయిన్‌తో తిలక్ వర్మ డేటింగ్?

ఆ తెలుగు హీరోయిన్‌తో తిలక్ వర్మ డేటింగ్?

4.పంజాబ్ కింగ్స్

వరుసగా 6 పరాజయాలతో పంజాబ్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు 31.10 శాతంగా ఉన్నాయి. లక్నోతో చివరి మ్యాచ్‌లో గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

5. చెన్నై సూపర్ కింగ్స్..

ఆదివారం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఓటములు చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసొచ్చాయి. ప్రస్తుతం సీఎస్‌కే‌కు 35.50 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ గెలిచి, గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఓడాలి. లేదంటే ఆ జట్టు కంటే మెరుగైన రన్‌రేట్‌ను సీఎస్‌కే కలిగి ఉండాలి.

6. ఢిల్లీ, కేకేఆర్..

అదృష్టం కలిసి వస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనున్నాయి. ఢిల్లీకి 10.60 శాతం, కేకేఆర్‌కు 13.90 శాతం మాత్రమే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. కేకేఆర్ తమ చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. ఢిల్లీ తమ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చేరుకోలేవు. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

7. ముంబై, లక్నో చేతిలో భవితవ్యం..

అందరి కన్నా ముందే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో చేతిలో ఇతర జట్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ భవితవ్యం ఈ రెండు జట్లపైనే ఆధారపడి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా రాజస్థాన్ ఇంటిబాట పడుతుంది. ఇటు పంజాబ్ పిలక లక్నో చేతిలో ఉంది. తన చివరి మ్యాచ్‌ను ఆ జట్టుతో ఆడాల్సి ఉంది.

అది గ్యాంబ్లింగ్ కాదు.. ప్లే ఆఫ్స్ చేరే అర్హత మాకు లేదు: రియాన్ పరాగ్

అది గ్యాంబ్లింగ్ కాదు.. ప్లే ఆఫ్స్ చేరే అర్హత మాకు లేదు: రియాన్ పరాగ్
Story first published: Monday, May 18, 2026, 11:40 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+