Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆర్‌సీబీ చేతిలో పరాజయం.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 6వ మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమిపాలైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 23 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఆర్‌సీబీ విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమిపాలైంది.

ఈ పరాజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారగా.. ఆర్‌సీబీ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వరుసగా ఆరు పరాజయాలు ఎదురైనా పంజాబ్ కింగ్స్‌కు టెక్నికల్‌గా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి మ్యాచ్‌లో మెరుగైన రన్‌‌రేట్‌తో విజయం సాధించి.. ఇతర జట్ల ఫలితాలు కలిసొస్తే పంజాబ్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.

పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు ఒక మ్యాచ్ డ్రాతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరి మ్యాచ్‌‌లో విజయం సాధిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్స్ చేరుతాయి.

IPL 2026 Playoff Scenarios How Punjab Kings Can Still Qualify After 6th Straight Loss

నాలుగో స్థానం కోసం పోటీపడే ఇతర జట్లు 14 పాయింట్లకే పరిమితమైతే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒకదాంట్లో ఓడాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడిపోవాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిపోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి, తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవాలి. ఈ పరాజయాలతో పాటు పంజాబ్ తమ నెట్ రన్ రేట్ కేకేఆర్ కంటే మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.

లక్నో చేతిలో ఓడినా అవకాశం..

పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR).. ముంబై ఇండియన్స్ (MI) చేతిలో ఓడిపోయి, ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడించినట్లయితే, పంజాబ్, కోల్‌కతా పాయింట్లలో సమమవుతాయి. అప్పుడు మెరుగైన NRR ఉన్న జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్ పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Sunday, May 17, 2026, 21:43 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+