Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కొంపముంచిన బౌలర్లు.. 219 కొట్టినా గెలవని SRH

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెత్త బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి మూల్యం చెల్లించుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38), హెన్రీచ్ క్లాసెన్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 39) పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్‌కు ఒక వికెట్ దక్కింది.

IPL 2026 PBKS Secure Stunning Victory as Heinrich Klaasen s Slow Strike Rate and Wayward Bowling Sink SRH

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్(3/33) ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే ఒక వికెట్ తీసాడు.

SRH చెత్త బౌలింగ్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్, హర్ష్‌దూబే మినహా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా హర్షల్ పటేల్(0/39), జయదేవ్ ఉనాద్కత్(0/26), ఎషాన్ మలింగా(0/46) వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది.

ప్రఫుల్ హింగే‌‌ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అనూహ్యంగా అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించింది. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఉనాద్కత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. హర్షల్ పటేల్ అయితే ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో 220 పరుగుల భారీ లక్ష్యం కూడా పంజాబ్ కింగ్స్ ముందు చిన్నబోయింది.

కొంపముంచిన క్లాసెన్ జిడ్డూ బ్యాటింగ్..

బ్యాటింగ్ సందర్భంగా హెన్రీచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాడు. 33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 39 పరుగులే చేశాడు. దాంతో 250 ప్లస్ రన్స్ చేస్తుందనకున్న సన్‌రైజర్స్ 219 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ విధ్వంసంతో పవర్ ప్లేలోనే 105 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..తర్వాతి 14 ఓవర్లలో 114 పరుగులే చేయగలిగింది. చివరి 5 ఓవర్లలో మరీ దారుణంగా 37 పరుగులే రాబట్టింది. మరో 20-30 పరుగుల అదనంగా చేసి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది.

Story first published: Saturday, April 11, 2026, 19:20 [IST]
Other articles published on Apr 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+