IPL 2026: ముంబై చేతిలో ఓటమి.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఒకటా.. రెండా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్ రద్దు) దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అందరికంటే ముందు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు వెళ్తుందనుకున్న జట్టుకు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది.
ముంబై ఇండియన్స్‌తో గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా ఐదో పరాజయం. దాంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ ప్లేస్‌ను ఖరారు చేసుకోవాలంటే పంజాబ్ కింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు..
1. మిగిలిన 2 మ్యాచ్‌లకు 2 గెలవాలి
పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే..చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి. అప్పుడు 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్ కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా 16 పాయింట్లు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంజాబ్ ఆ మార్క్‌ను అందుకోవాలంటే రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే.

2. ఒక మ్యాచ్ ఓడి మరో మ్యాచ్ గెలిస్తే..
చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడితే పంజాబ్ కింగ్స్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అప్పుడు పంజాబ్ ఖాతాలో 15 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. టాప్-3 జట్లు కాకుండా టాప్-4 ప్లేస్ కోసం పోటిపడే జట్లు 14 పాయింట్స్‌తోనే నిలవాలి. అప్పుడు పంజాబ్ 15 పాయింట్స్‌తో టోర్నీలో ముందడుగు వేస్తోంది.
3. నెట్ రన్ రేట్ కీలకం
వరుస ఓటములతో పంజాబ్ కింగ్స్ రన్ రేట్ (0.355) బలహీన పడింది. ఒకవేళ నాలుగో స్థానం కోసం పోటీపడే జట్లు సేమ్ పాయింట్స్ సాధిస్తే.. అప్పుడు రన్‌రేట్ కీలకం అవుతుంది. అయితే ఓ మ్యాచ్ రద్దుతో పంజాబ్ ఖాతాలో ఒక పాయింట్ ఉండటంతో.. ఇతర జట్లతో సేమ్ పాయింట్స్ సాధించే అవకాశం లేదు. కానీ ఐపీఎల్‌లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి రన్‌రేట్ మెరుగుపర్చుకోవడం ఉత్తమం.
4. రెండు మ్యాచ్‌లకు రెండు ఓడితే..
పంజాబ్ కింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఎందుకంటే అప్పుడు పంజాబ్ ఖాతాలో 13 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం టాప్-3లో ఉన్న ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ తమ బెర్త్‌లను ఖరారు చేసుకొని.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు మార్గం సుగమం అవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications