Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!

'ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి'అంటే ఇదేనేమో. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. ఈ సీజన్‌లో తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా చతకిలపడి చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది.

వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్‌‌తో గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ ఓటమిపాలైంది. మరోసారి 200 ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు 200+ రన్స్ చేసినా ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటి వరకు 10 సార్లు 200+ రన్స్ చేసి పంజాబ్ ఓడింది. 8 పరాజయాలతో వెస్టిండీస్,7 ఓటములతో ఆర్‌సీబీ, 6 ఓటములతో సీఎస్‌కే ఈ జాబితాలో తర్వాతి స్తానాల్లో నిలిచాయి.

IPL 2026 PBKS Create Unwanted History with Record 10th Defeat in 200 Chases After Loss to MI

అంతేకాకుండా ఐపీఎల్‌లో వరుసగా 5 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచి వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టుగా చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ ఫీట్ నమోదు చేసింది. ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

PBKS vs MI: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నేటి మ్యాచ్ రద్దు?

PBKS vs MI: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నేటి మ్యాచ్ రద్దు?

చివరి 3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఛేజ్ చేసిన అత్యధిక లక్ష్యాలు:

50 పరుగులు vs PBKS (ధర్మశాల, 2026)

49 పరుగులు vs KKR (వాంఖడే, 2017)
48 పరుగులు vs CSK (ఢిల్లీ, 2021)


టీ20ల్లో 200+ పరుగుల ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు

11 - పంజాబ్ కింగ్స్
8 - ముంబై ఇండియన్స్
7 - ఆస్ట్రేలియా / రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు


ఐపీఎల్‌లో 200+ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డు:

20 మ్యాచ్‌ల్లో 12 విజయం. ఏడింటిలో ఓటమి. ఫలితం తేలని మ్యాచ్ ఒక్కటి. ఐపీఎల్ చరిత్ర‌లో మరే కెప్టెన్‌ కూడా ఈ చెత్త రికార్డ్‌ను మూటగట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా T20ల్లో కేవలం ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రమే ఇన్ని ఓటములను ఎదుర్కొన్నారు.

ఐపీఎల్‌లో ఒక నిర్దిష్ట జట్టుపై కెప్టెన్‌గా వరుసగా అత్యధిక విజయాలు:

8 - గౌతమ్ గంభీర్ vs PBKS (2014-17)
8 - రోహిత్ శర్మ vs KKR (2015-18)
7 - MS ధోని vs DC (2012-15)
7 - డేవిడ్ వార్నర్ vs PBKS (2015-20)
7 - శ్రేయస్ అయ్యర్ vs MI (2022-26) - (శ్రేయస్ పరంపర తాజా ఓటమితో ముగిసింది)

ముంబై ఇండియన్స్‌పై కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా 2020 ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓడిపోయారు.


టీ20ల్లో 200+ ఛేజింగ్‌లో ఎదురైన అత్యధిక ఓటములు:

10 - పంజాబ్ కింగ్స్
8 - వెస్టిండీస్
7 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
6 - చెన్నై సూపర్ కింగ్స్.

IPL 2026: ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు?

IPL 2026: ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు?
Story first published: Friday, May 15, 2026, 9:31 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+