ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న తమ ఆరంభ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. గత సీజన్ తమకు అద్భుతంగా సాగినప్పటికీ.. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. లక్ష్యాన్ని ఛేదించే విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాకుండా మేం ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. ఈ మ్యాచ్‌ల్లో ఎంత స్కోర్ చేసినా.. సులభంగా ఛేజ్ అయ్యాయి. దాంతోనే ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను.

గత సీజన్ మాకు అద్భుతంగా సాగింది. కానీ మేం ప్రస్తుతంలో ఉండాలి. గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేం మా అత్యుత్తమ బ్రాండ్ క్రికెట్‌ను ఆడాలి. జట్టులోకి కొత్తగా కూపర్ కున్నోల్లీ వచ్చాడు. స్టోయినిస్, బార్ట్‌లెట్, మార్కో జాన్సెన్ ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ' పిచ్ చాలా బాగుంది. గత రెండు రోజులుగా కొద్దిపాటి వర్షం పడుతోంది. బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్ అనిపిస్తోంది.గత సీజన్ మాకు అద్భుతంగా సాగింది. మా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు గ్లెన్, అశోక్ శర్మ అరంగేట్రం చేస్తున్నారు. మేం జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రబడలతో కూడిన ఓవర్‌సీస్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. బట్లర్ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. కచ్చితంగా అతను ఈ సీజన్‌లో రాణిస్తాడని నేను నమ్ముతున్నాను.'అని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.
పంజాబ్ కింగ్స్:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
గుజరాత్ టైటాన్స్:
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఎం షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కాగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్.