IPL 2026: పాట్ కమిన్స్ తీన్మార్.. CSK బేజార్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 181 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. పాట్ కమిన్స్(3/28), సాకిబ్ హుస్సేన్(2/34) సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లకు 180 పరుగులు చేసింది.
డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది.
మళ్లీ విఫలమైన సంజూ..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన సంజూ శాంసన్(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 27)ను మూడో ఓవర్‌లోనే పాట్ కమిన్స్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. రెండు భారీ సిక్స్‌లతో జోరు కనబర్చిన ఉర్విల్ పటేల్(13)ను సాకిబ్ హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

కార్తీక్ శర్మ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(15) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడినా.. కార్తీక్ శర్మ భారీ షాట్స్‌తో చెలరేగాడు. అయితే ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. కార్తీక్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి 42 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
ఆదుకు శివమ్, బ్రెవిస్..
తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను క్యాచ్ ఔట్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 100 పరుగులకే సీఎస్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే జట్టును ఆదుకున్నారు. బ్రెవిస్ తనదైన షాట్స్‌తో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని మలింగా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఐదో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్‌లోనే శివమ్ దూబే(26)ను సాకిబ్ హుస్సేన్ ఔట్ చేయగా.. ప్రశాంత్ వీర్(11), అకీల్ హుస్సేన్(3 నాటౌట్) జట్టు స్కోర్‌ను 180 పరుగులకు చేర్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications