Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా బ్యాటర్ల తప్పు లేదు.. వారి వల్లే ఈ ఘోర పరాజయం: పాట్ కమిన్స్

గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో తమ పతనాన్ని శాసించారని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. టీ20 క్రికెట్‌లో ఇంతకంటే అత్యుత్తమ బౌలింగ్‌ను చూసి ఉండమని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 83 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తయ్యింది.

168 పరుగుల సాధారణ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాట్ కమిన్స్.. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. పేలవ ప్రదర్శన కనబర్చిన తమ బ్యాటర్లను వెనకేసుకొచ్చాడు. ఈ ఒక్క వైఫల్యంతో తమ బ్యాటర్లను నిందించాల్సిన అవసరం లేదన్నాడు. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ను మరిచిపోయి తదుపరి మ్యాచ్‌లకు సిద్దమవుతామని తెలిపాడు.

ఈ గెలుపు క్రెడిట్ వారి బౌలర్లదే..

'గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో మా బౌలింగ్ తీరు నాకు సంతృప్తినిచ్చింది. కానీ ఈ వికెట్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. గుజరాత్ బౌలర్లు పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బౌలింగ్ చేశారు. ఇలాంటి క్లిష్టమైన స్పెల్స్‌ను ఎలా ఎదుర్కోవాలో మేం ఆలోచించాలి. అయితే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా గుజరాత్ టైటాన్స్ బౌలర్లదే.

IPL 2026 Pat Cummins Praises GT Bowlers After Defeat Remains Confident in SRH s Top-Heavy Batting Order
Photo Credit: screen grab for JioHotstar

మేం ఎప్పుడూ మా లోపాలను సరిదిద్దుకోవాలని చూస్తాం. ఈ మ్యాచ్‌లో బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్‌లో వేసినప్పుడు బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారింది. గుజరాత్ బౌలర్లు మాకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. వారి బౌలింగ్ చేసిన తర్వాత మేం ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందని అనిపించింది. వారి బౌలింగ్ నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి.

మా బ్యాటర్ల తప్పులేదు..

ఇంకాస్త మెరుగైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయాల్సింది. ఏది ఏమైనా టీ20 క్రికెట్‌లో ఇంతకంటే అత్యుత్తమ బౌలింగ్‌ను చూసి ఉండం. మా బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ ఒక్క మ్యాచ్ ఫలితాన్ని బట్టి మేం అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా టాప్ ఫోర్ బ్యాటర్లందరూ ఈ సీజన్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేశారు. వారంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.

టీ20 క్రికెట్‌లో ఇలాంటి ఫలితాలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. మాకు బాగా తెలిసిన వేదికల్లోనే తర్వాతి మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఈ టోర్నీ ఆరంభంలోనే ఎక్కువ విజయాలు సాధించడం ముఖ్యం.

మేం గత ఏడు మ్యాచ్‌ల్లో ఐదు లేదా ఆరు గెలిచాం. అది మాకు ప్లేఆఫ్ రేసులో కొంచెం ఊరటనిస్తుంది. క్వాలిఫై అవ్వడానికి మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మేం గతంలో ఏ వ్యూహాలతో గెలిచామో వాటిపైనే మళ్ళీ దృష్టి పెడతాం. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి తదుపరి మ్యాచ్‌లకు సిద్ధమవుతాం.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 12, 2026, 23:53 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+