Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే బౌలింగ్ ఎంచుకున్నాను.. మాకు పోయేదేం లేదు: పాట్ కమిన్స్

పిచ్ కండిషన్స్‌ తెలుసుకునేందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఈ మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచినా.. పిచ్ గురించి ఏం తెలియనప్పుడు ముందుగా బౌలింగ్ చేయడమే ఉత్తమమని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కమిన్స్.. తమ జట్టుపై గుజరాత్ టైటాన్స్‌కు మెరుగైన రికార్డు ఉందని, దాంతో ఆ జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలిపాడు.

IPL 2026: పంజాబ్ కొంపముంచిన పాంటింగ్!

IPL 2026: పంజాబ్ కొంపముంచిన పాంటింగ్!

పిచ్ కండిషన్స్ తెలుసుకునేందుకు..

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. మేం ఇక్కడ ఇంతకు ముందు ఆడలేదు. అందుకే ముందుగా బౌలింగ్ చేసి పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత కండిషన్స్‌కు తగ్గట్లు ఆడి ఛేజింగ్ చేస్తాం. ఈపిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచాయనే రికార్డును పరిగణలోకి తీసుకున్నాం. అయితే ఇందులో చాలా అంశాలు ఉంటాయి.

ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే జట్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యి ఉండవచ్చు. మేం అన్నింటినీ పరిశీలిస్తాం. కానీ చివరికి మా మనసు చెప్పే నిర్ణయం తీసుకుంటాం. ఎవరూ కూడా పిచ్‌ను ఖచ్చితంగా అంచనా వేయలేరు. ఇది మాకు కీలకమైన మ్యాచ్, టోర్నమెంట్‌లో చాలా ఉత్కంఠభరితమైన సమయం.

IPL 2026 Pat Cummins Explains Bold Decision to Bowl First in Crucial SRH vs GT Clash at Ahmedabad

మనకు పోయేదేం లేదన్నా..

నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మాకు నాకౌట్‌లా ఏం అనిపించడం లేదు. ఫైనల్ చేరడానికి మాకు మేమే కొన్ని అవకాశాలు ఇచ్చుకున్నాం. మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మాకు మంచి బ్రేక్ లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్‌కు మెరుగైన రికార్డ్ ఉందని అభిషేక్ శర్మ నాతో అన్నాడు. వెంటనే నేను మనం కోల్పేయేది ఏం లేదు. ఒత్తిడంతా వారిపైనే ఉంటుందని చెప్పాను. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నా..

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మాకు మెరుగైన రికార్డు ఉంది. అయితే ఈ గణంకాలు, రికార్డుల పట్ట నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. నిజానికి మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. కానీ గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ వికెట్ బ్యాటింగ్‌కు కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది.

టీమ్ ఆలోచనల్లో, ప్రణాళికలు అమలు చేయడంలో సాధ్యమైనంత వరకు స్థిరంగా ఉండటమే ముఖ్యం. ఇది టోర్నమెంట్ ముగింపు దశ.. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన చేయడం చాలా కీలకం. మేం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

కమిన్స్‌కు సైగలు: కావ్యపాప.. ఏమిటీ హంగామా! (వీడియో)

కమిన్స్‌కు సైగలు: కావ్యపాప.. ఏమిటీ హంగామా! (వీడియో)

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఈషన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, నిషాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, May 12, 2026, 19:53 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+