Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి వల్లే టాప్-2 ప్లేస్‌ చేజారింది: ప్యాట్ కమిన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు ఆచితూచి ఆడటంతోనే తమ జట్టు టాప్-2 ప్లేస్‌కు చేరలేకపోయిందని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. తమ బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేసినా.. బౌలర్లు కొత్త ప్రయోగాలు చేసినా ఆర్‌సీబీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 55 పరుగుల భారీ తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. ఈ గెలుపుతో మొత్తం 9 విజయాలతో 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. పేలవ రన్‌రేట్ కారణంగా టాప్-2 ప్లేస్‌ను దక్కించుకోలేక తృటిలో క్వాలిఫయర్-1 ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాప్-2 ప్లేస్ దక్కేది.

వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో మరో కొత్త టీమ్!

వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో మరో కొత్త టీమ్!

సాయశక్తులా ప్రయత్నించాం..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. టాప్-2 ప్లేస్ కోసం తమ సాయశక్తులా ప్రయత్నించామని తెలిపాడు. కానీ ఆర్‌సీబీ బ్యాటర్లు తెలివిగా బ్యాటింగ్ చేసి తమ అగ్రస్థానాన్ని కాపాడుకున్నారని చెప్పాడు. 'ఈ మ్యాచ్‌లో మేం భారీ స్కోర్ చేయడం అద్భుతంగా అనిపించింది. మా బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. మా ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

పాయింట్స్ టేబుల్‌లో టాప్-2 స్థానాల్లో నిలవాలంటే చాలా సమీకరణాలు మాకు అనుకూలంగా జరగాలని నాకు ముందే తెలుసు. కానీ మేం టాప్-2 ప్లేస్‌కు దగ్గరగా వచ్చి తృటిలో చేజార్చుకున్నాం. అయితే ఆర్‌సీబీ ఆటగాళ్లు నెట్‌రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తగా లెక్కలతో ఆడుతారని తెలుసు. అందుకే మేం బౌలింగ్‌లో వారిపై కొన్ని కొత్త ప్రయోగాలు చేశాం. ఏది ఏమైనా ఇది మాకు అతిపెద్ద విజయం.

IPL 2026 Pat Cummins Breaks Silence on SRH Missing Out on Top-2 Playoff Finish Despite Beating RCB in a High-Scoring Thriller
Photo Credit: screen grab for JioHotstar

అది నాకు దక్కిన వరం..

మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. నిజానికి నేను కూడా మా బౌలర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇషాన్ మలింగా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను విభిన్నమైన వైవిధ్యాలతో బౌలింగ్ చేస్తున్నాడు.సాకీబ్ హుస్సేన్ కూడా అదరగొడుతున్నాడు. ఇలాంటి బౌలర్లు ఉండటం కెప్టెన్‌గా నాకు లభించిన వరమనే చెప్పాలి.

ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఇంకా 5 నుంచి 6 రోజుల సమయం ఉంది. మేం రెండు రోజులు బాగా విశ్రాంతి తీసుకుంటాం. ఆ తర్వాత ఎలిమినేటర్ వేదికకు చేరుకొని మా సాధనను ప్రారంభిస్తాం. మా ఆటగాళ్లకు ఆ మైదానం గురించి బాగా తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్లి రాణిస్తాం. రెండు రోజుల్లో ఎలిమినేటర్‌లో మా ప్రత్యర్థి ఎవరా? అనేది క్లారిటీ వస్తుంది.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

కాటేరమ్మ కొడుకుల ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/33) రెండు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లకు తలో వికెట్ దక్కింది.

IPL 2026: SRH ఘన విజయం.. కానీ ఆర్‌సీబీదే టాప్ ప్లేస్!

IPL 2026: SRH ఘన విజయం.. కానీ ఆర్‌సీబీదే టాప్ ప్లేస్!
Story first published: Saturday, May 23, 2026, 0:26 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+