IPL 2026: ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ఐపీఎల్ ఫాస్టెస్ బౌలర్.. ఇక దబిడి దబిడే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగే మ్యాచ్‌కు తమ ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అందుబాటులోకి వచ్చాడని లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్ టామ్ మూడీ తెలిపాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డ్ మయాంక్ యాదవ్ పేరిట ఉంది.
గత ఐపీఎల్ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్ యాదవ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలతో ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కూడా అతను దూరంగా ఉన్నాడు. అయితే, ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని టామ్ మూడీ మంగళవారం మీడియాకు తెలిపారు.
వర్క్‌లోడ్ నేపథ్యంలోనే ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు అతన్ని దూరంగా ఉంచామని చెప్పిన టామ్ మూడీ.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ అతను సాధించాడని తెలిపాడు.

మరోవైపు ఎడమచేతి వాటం పేసర్ మోహ్సిన్ ఖాన్ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. బుధవారం జరిగే తుది పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే అతను కూడా జట్టు ఎంపికకు అందుబాటులోకి రానున్నాడు. ఈ ఇద్దరు పేసర్లు జట్టులోకి వస్తే లక్నో బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ప్రధాన బౌలర్లు గాయపడిన సమయంలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టు బౌలింగ్‌ను ముందుండి నడిపించాడు. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. షమీ అనుభవం, నాయకత్వ లక్షణాలు జట్టుకు ఎంతో ప్లస్ అవుతున్నాయని టామ్ మూడీ కొనియాడాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో జట్టుకు బుధవారం ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పట్టికలో ఎగబాకాలని రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు పట్టుదలతో ఉంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీపైనే మయాంక్ యాదవ్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. తన మొదటి మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్‌పై 155.8 kmph వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications