IPL 2026: బుడ్డోడికి నో ఛాన్స్.. ఒక్క మ్యాచ్ ఆడకున్నా.. టాక్ ఆఫ్ ది టోర్నీగా ధోనీ!
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై 6 ఏళ్లు గడుస్తున్నా.. ధోనీపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లకు మైదానాలన్నీ పసుపుమయం అవుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ధోనీనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
దురదృష్టవశాత్తు గాయం కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. అయినా ధోనీ టాక్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోషల్ మీడియా వేదికగా అత్యంత ఎక్కువగా మాట్లాడుకున్న క్రికెటర్ల జాబితాను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 12 వరకు ఉన్న డేటాను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను ప్రకటించారు.

ఈ జాబితాలో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ, చెన్నైసూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్, ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాజస్థాన్ రాయల్స్ టినేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేరు ఈ జాబితాలో లేదు. ఈ సీజన్‌లో తనదైన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంతేకాకుండా 15 బంతుల్లోనే రెండు సార్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ల బౌలింగ్‌లో తొలి బంతినే బౌండరీకి తరలించాడు. అలాంటి వైభవ్ సూర్యవంశీ పేరు ఈ జాబితాలో లేకపోవడం అందర్నీ విస్మయ పరుస్తుంది.
ఈ టోర్నీలో కోహ్లీ గురించి 44 శాతం మంది మాట్లాడుకోగా.. ధోనీ గురించి 21 శాతం, రోహిత్ శర్మ 18 శాతం, సంజూ శాంసన్(10 శాతం), కేఎల్ రాహుల్ 8శాతం చర్చించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications