IPL 2026: మలుపు తిప్పిన CSK కోహి‘నూర్’.. చిత్తుగా ఓడిన కేకేఆర్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ కేకేఆర్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చెత్త బ్యాటింగ్ కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీసింది. మరోవైపు సీఎస్‌కే సమష్టి ప్రదర్శనతో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ఆయుష్ మాత్రే(17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి(2/35) రెండు వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసారు.
కేకేఆర్ 160
అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోవ్‌మన్ పోవెల్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్), రమణ్‌దీప్ సింగ్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) పోరాడినా ఫలితం లేకపోయింది. అంజింక్యా రహానే(28), సునీల్ నరైన్(24), అంగ్‌క్రిష్ రఘువంశీ(27)తో పాటు ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/21) మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, అకీల్ హోస్సెన్ తలో వికెట్ తీసారు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో కేకేఆర్ పాయింట్ల ఖాతా తెరిచింది.
మలుపు తిప్పిన నూర్ అహ్మద్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 192 పరుగులు చేయడంతో కేకేఆర్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో డ్యూ కూడా రావడంతో ఈజీగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని అనుకున్నారు. కానీ కేకేఆర్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. డేంజరస్ ఫిన్ అలెన్(1) మరోసారి తీవ్రంగా నిరాశపర్చగా.. స్పిన్నర్ నూర్ అహ్మద్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు.
అంజిక్యా రహానే(28)తో పాటు రింకూ సింగ్(6), కామెరూన్ గ్రీన్(0)ను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత వచ్చిన రోవ్‌మన్ పోవెల్, రమణ్‌దీప్ సింగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్ కూడా స్లోగా మారినట్లు అనిపించింది. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కూడా దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications