Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ చిట్కాతోనే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన: నూర్ అహ్మద్

మంచు ప్రభావం, ఉక్కపోతగా ఉన్న పరిస్థితుల్లో తన చేతి వేళ్లు తడవకుండా పాటించిన చిట్కాతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశానని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) స్పిన్నర్ నూర్ అహ్మద్ అన్నాడు. తన చేతి వేళ్లు పొడిగా ఉండటంతో సరైన ప్రదేశంలో బంతిని వేయగలిగానని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో మంగళవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్(3/21) మూడు వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

'నా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. విపరీతమైన మంచు, ఉక్కపోతగా ఉన్న పరిస్థితుల్లో నా చేతి వేళ్లు తడవకుండా పొడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాను. దాంతో నేను అనుకున్న ప్రదేశంలో బంతిని వేయగలిగాను. చేతి వేళ్లను పొడిగా ఉంచుకోవాలనే చిట్కా బాగా పనిచేసింది.

IPL 2026 Noor Ahmad Explains How He Overcame Dew and Humidity to Demolish KKR s Batting Lineup
Photo Credit: screen grab for JioHotstar

ఈ పిచ్ తీరు కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. బంతి బ్యాట్‌పైకి అంత సులువుగా రావడం లేదని నేను గ్రహించాను. ఆ పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. ఇలాంటి ప్రదర్శనలు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా నా జట్టు కోసం ఇలాగే కష్టపడి రాణిస్తాను. ప్రతి పిచ్‌పై బంతి వేగంలో మార్పులు చేయడం అనేది ఉత్తమమైన మార్గం. ఈ రాత్రి 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది.'అని నూర్ అహ్మద్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ఆయుష్ మాత్రే(17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి(2/35) రెండు వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసారు.

అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోవ్‌మన్ పోవెల్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్), రమణ్‌దీప్ సింగ్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) పోరాడినా ఫలితం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్(3/21) మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, అకీల్ హోస్సెన్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, April 15, 2026, 8:05 [IST]
Other articles published on Apr 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+