Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHకు గుడ్‌బై.. క్లారిటీ ఇచ్చిన నితీష్ రెడ్డి

తాను సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ జట్టు స్టార్ ఆల్‌‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే కొనసాగుతానని ఎక్స్‌వేదికగా తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో తనను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపడంపై నితీష్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడని, జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నితీష్ కుమార్ రెడ్డి అందరికీ క్లారిటీ ఇచ్చాడు. 'ఇలాంటి ప్రచారాలకు నేను దూరంగా ఉంటా. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నా బంధం నమ్మకం, గౌరవం అనే వాటితో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. నేనెప్పుడూ జట్టుతోనే ఉంటా'అని నితీష్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశాడు.

IPL 2026 Nitish Kumar Reddy breaks silence on SRH exit rumours

ఐపీఎల్ 2023 సీజన్‌లో కనీస ధర రూ. 20 లక్షలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 మ్యాచ్‌ల్లో 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా విలువైన పరుగులు జోడించి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు.

ఈ ప్రదర్శనతో టీమిండియా పిలుపు అందుకున్న నితీష్.. టీ20, టెస్ట్‌ల్లో సత్తా చాటాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉన్నా.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేందుకే మొగ్గు చూపాడు. రూ. 6 కోట్ల రిటెన్షన్‌కు ఒప్పుకున్నాడు. కానీ ఈ సీజన్‌లో నితీష్ రెడ్డి ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 32 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 2 వికెట్లే పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతను సన్‌రైజర్స్‌ను వీడేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ నితీష్ వాటిని ఖండించాడు.

Story first published: Sunday, July 27, 2025, 19:21 [IST]
Other articles published on Jul 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+