Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యర్థి ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు.. బర్గర్‌కు జరిమానా!

ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్ పేసర్ నండ్రే బర్గర్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బర్గర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నండ్రే బర్గర్(2/27) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌ను డకౌట్ చేయడంతో పాటు హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ మార్ష్(55)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌వైపు మలుపు తిప్పాడు. ఈ వికెట్లను బర్గర్ అత్యుత్సాహంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ బర్గర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించాడు.

IPL 2026 Nandre Burger Fined for Disciplinary Breach Against Rishabh Pant in LSG vs RR clash

ఈ మేరకు ఐపీఎల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. 'రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నండ్రే బర్గర్‌కు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించాం. ఒక డీమెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో చేర్చాం. ఐపీఎల్‌ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలింది. ఆర్టికల్ 2.5 ప్రకారం మరో ఆటగాడిని కించపరిచేలా ప్రవర్తించడం, అనుచిత ప్రవర్తన , భాష ఉపయోగించినట్లు తేలితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బర్గర్ లెవల్ 1 ఉల్లంఘనకు పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ తీసుకున్న తుది నిర్ణయంతో ఈ జరిమానా విధించడం జరిగింది.’అని ఐపీఎల్ తమ ప్రకటనలో పేర్కొంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/30), ప్రిన్స్ యాదవ్(2/29), మోహ్‌సిన్ ఖాన్(2/17) రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆయుష్ బదోని(0), రిషభ్ పంత్(0), ఎయిడెన్ మార్క్‌రమ్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/20) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/27), బ్రిజేష్ శర్మ(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.

Story first published: Thursday, April 23, 2026, 16:05 [IST]
Other articles published on Apr 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+