Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: అది అవ్వదమ్మా: సీఎస్‌కే మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇవాళ(సోమవారం) కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. అయితే మరోవైపు ఈ సీజన్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే ఆఖరి మ్యాచ్ ఇదే. దాంతో అనేక ఊహగానాలు తెరపైకి వస్తున్నాయి.

సీఎస్‌కే దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి ఇది వీడ్కోలు మ్యాచ్‌ అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను చెపాక్ స్టేడియం వేదికగా సొంత అభిమానుల మధ్య ఆడుతానని ధోనీ గతంలో వెల్లడించాడు. దాంతో సన్‌రైజర్స్‌తో జరిగే నేటి మ్యాచే అతనికి చివరిదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

IPL 2026 MS Dhoni NOT Retiring Tonight vs SRH Ravichandran Ashwin s Viral Prediction Sparks Hope for IPL 2027

ఈ సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క మ్యాచ్ ఆడలేదు. గాయం కారణంగా పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. థ్యాంక్యూ ధోనీ, సీఎస్‌కే అనే పోస్ట్‌లు నెట్టింట హల్‌ఛల్ చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల ధోనీ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌ను ఉద్దేశించి ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కెప్టెన్‌దే తుది నిర్ణయమని, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ నిమ్మిత పాత్రులేనని స్పష్టం చేశాడు.

అయితే ధోనీ ఫ్యాన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్ న్యూస్ చెప్పాడు. నేటి మ్యాచ్‌.. ధోనీ ఫేర్‌వెల్ గేమ్ కాదని పరోక్షంగా వెల్లడించాడు. అది అవ్వదమ్మా అంటూ ట్వీట్ చేశాడు. 'ఈ రోజు ఏం జరగడం లేదు.. బహుషా అది 2027లో ఉండొచ్చు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు జరుగుతాయని నేను అనుకోవడం లేదు. అకీల్ హోసేన్ జట్టులోకి వస్తాడా?'అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ధోనీ వీడ్కోలు మ్యాచ్‌ను ఉద్దేశించే అశ్విన్.. ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ధోనీకి మరో గాయమైందని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే నేటి మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి.

Story first published: Monday, May 18, 2026, 12:09 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+