Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: గుజరాత్ చేతిలో ఘోర పరాజయం.. CSK ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్(CSK) నిష్క్రమించింది. ఘోర పరాజయంతో ఈ సీజన్‌ను ముగించింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సీఎస్‌కే 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

బ్యాటింగ్‌లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు సత్తా చాటగా.. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్(3/26), కగిసో రబాడ(3/32), రషీద్ ఖాన్(3/18) నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సిరాజ్ పవర్ ప్లేలోనే చెన్నైని దెబ్బతీసాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ తమ టాప్-2 ప్లేస్‌ను మరింత పదిలం చేసుకుంది.

IPL 2026 Mohammed Siraj Powerplay Masterclass Helps GT Crush CSK by 89 Runs Chennai Knocked Out

టాప్-3 విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), శుభ్‌మన్ గిల్(37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64), జోస్ బట్లర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూ షార్ట్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) పర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

గెలిపించిన సిరాజ్..

230 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను పవర్ ప్లేలోనే మహమ్మద్ సిరాజ్ దెబ్బతీసాడు. తొలి బంతికే సంజూ శాంసన్(0)ను క్యాచ్ ఔట్ చేసిన సిరాజ్.. తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(16)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో ఉర్విల్ పటేల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి సీఎస్‌కేను కోలుకోలేని దెబ్బతీసాడు. పవర్ ప్లేలోనే సిరాజ్ మూడు వికెట్లు తీయడంతో సీఎస్‌కే కోలుకోలేకపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురై వికెట్లు పారేసుకున్నారు.

Story first published: Thursday, May 21, 2026, 23:27 [IST]
Other articles published on May 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+