For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs RR: క్యాచ్ పట్టి బౌండరీలోకి విసిరేసిన సిరాజ్!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బౌండరీ లైన్‌పై స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఆశ్చర్యకరంగా బంతిని బౌండరీ‌లోకి విసిరేసాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. సిరాజ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

కగిసో రబడా వేసిన 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని రాజస్థాన్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెనక్కి జరిగి అద్భుతంగా అందుకున్నాడు. కానీ ఈ క్రమంలో అతను సమన్వయం కోల్పోయి బంతిని గాల్లోకి విసిరేసే ప్రయత్నం చేశాడు. కానీ పొరపాటున బంతిని బౌండరీ లోపలికి కాకుండా బయటకు వేసాడు.

IPL 2026 Mohammed Siraj s Massive Blunder Drops Easy Catch and Gifts a Six in GT vs RR Clash
Photo Credit: twitter (X)

తన తప్పిదాన్ని వెంటనే గ్రహించిన సిరాజ్.. డైవ్ చేసి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి దూరంగా పడి సిక్సర్‌గా మారింది. సిరాజ్ అత్యుత్సాహంతో ఈజీ క్యాచ్‌ను కాస్త సిక్సర్‌గా మార్చాడని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), ధ్రువ్ జురెల్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 4, 2026, 22:14 [IST]
Other articles published on Apr 4, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+