టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్.. బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ ఒకే కాఫీ షాప్‌లో కలిసి కనిపించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కాఫీ షాప్ నుంచి ఈ ఇద్దరూ విడివిడిగా బయటకు వచ్చినప్పటికీ, ఒకే సమయంలో అక్కడే ఉండటంతో సందేహాలు మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ గడిపారని, ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ డేటింగ్ వార్తలపై మహమ్మద్ సిరాజ్, మహిరా శర్మ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగని ఖండించను లేదు. సిరాజ్, మహిరా శర్మ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2024 చివర్లోనే ఈ ప్రచారం మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు ఫాలో అవ్వడం, ఫొటోలకు లైక్ చేసుకోవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.

గతేడాది ఈ డేటింగ్ వార్తలను సిరాజ్ ఖండించాడు. అవన్నీ అవాస్తవం, నిరాధారమైనవని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు. ఆ వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించాడు. మహిరా కూడా ఈ పుకార్లను ఖండించింది. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, తన కెరీర్‌పై మాత్రమే ఫోకస్ పెట్టానని స్పష్టం చేసింది. కానీ ప్రతీ సెలెబ్రిటీ కపుల్ ఇలానే చెబుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతుండటంతో ఈ డేటింగ్ పుకార్లు మరోసారి తెరపైకి వచ్చాయి. పంజాబ్ కింగ్స్‌తో మరికాసేపట్లో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్.. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
జమ్మూ కశ్మీర్‌లో 1997లో పుట్టిన మహిరా శర్మ.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్‌తో యాక్టింగ్‌వైపు వచ్చింది. నాగిన్ 3 అనే సీరియల్‌లో 'చుర్ఛురి' పాత్రతో గుర్తింపు పొందింది. కుండలి భాగ్య, బేపనా ప్యార్ సీరియల్స్‌తో కూడా ఆమె పాపులారిటీని సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ హిందీ సీజన్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ షోలో పరాస్ చాబ్రాతో ఆమె స్నేహం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. పంజాబీ ఇండస్ట్రీలో ఆమె ఒక టాప్ మోడల్.
ముఖ్యంగా లెహంగా సాంగ్ ఆమెకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ పాట యూట్యూబ్‌లో 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. 'కడే హా కడే నా', 'లెంబర్గిన్ని' వంటి పంజాబీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. మహిరా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె హిందీ వెబ్ సిరీస్‌లు , పంజాబీ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.