Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: బుడ్డోడిపై కన్నెర్ర చేసిన సిరాజ్!

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కన్నెర్ర చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) దూకుడుకు సిరాజ్ కళ్లెం వేసాడు. కళ్లు చెదిరే బౌన్సర్‌తో ఈ 15 ఏళ్ల కుర్రాడిని బోల్తా కొట్టించాడు. వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన ఆనందంలో సిరాజ్ కాస్త అతిగా ప్రవర్తించాడు.

గట్టిగా అరుస్తూ కన్నెర్ర చేశాడు. తన రెండు కను గుడ్లను పెద్దవిగా చేస్తూ వైభవ్ సూర్యవంశీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌ను వైభవ్ చితక్కొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్ బాదిన వైభవ్.. ఒకే ఓవర్‌లో మూడు బౌండరీలు బాది సిరాజ్‌కు కోపం తెప్పించాడు. అదే జోరులో షార్ట్ పిచ్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమై క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో సిరాజ్ గట్టిగా అరుస్తూ వైభవ్ సూర్యవంశీకి సెండాఫ్ ఇచ్చాడు.

IPL 2026 Mohammed Siraj Aggressive Celebration After Bowling Out Vaibhav Sooryavanshi in RR vs GT

అసలేం జరిగిందంటే..?

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో 3 బౌండరీలు బాదిన వైభవ్ సూర్యవంశీ ఐదో బంతిని పుల్ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. గంటకు 146.6 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ బంతిని అంచనా వేయడంలో వైభవ్ విఫలమయ్యాడు. దాంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేవగా.. అర్షద్ ఖాన్ ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. దాంతో సిరాజ్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

సిరాజ్.. సిగ్గుండాలి..

15 ఏళ్ల పిల్లాడిని ఔట్ చేసి అతిగా సంబరాలు చేసుకున్న సిరాజ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లాడిని భయపెట్టేలా సంబరాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైల్ జెమీసన్ సైతం.. వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసి ఇలానే అతిగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ నిర్వాహకులు సైతం కైల్ జెమీసన్‌ను మందలించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. సిరాజ్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

గుజరాత్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, May 9, 2026, 22:36 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+