Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతన్నే కొనసాగించాలి: మహమ్మద్ కైఫ్

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రానే కొనసాగించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. ముంబై ఇండియన్స్‌లో ఎక్కువ కెప్టెన్సీ ఆప్షన్స్ ఉండటంతో ఇన్నాళ్లు బుమ్రాకు అవకాశం దక్కలేదన్నాడు. వచ్చే ఏడాది అతనికి కెప్టెన్‌గా అవకాశం దక్కినా.. సత్తా చాటుతాడని కైఫ్ జోస్యం చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ దూరం కావడంతో బుమ్రా తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు.

బుమ్రానే కొనసాగించాలి..

తొలి మ్యాచ్‌లోనే విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ అనంతరం తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. బుమ్రా కెప్టెన్సీని కొనియాడాడు. తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్‌లో ముంబై గెలిచిందని అభిప్రాయపడ్డాడు.

IPL 2026 Mohammad Kaif Backs Jasprit Bumrah to Take Over as Full-Time Mumbai Indians Captain Next Season

'ముంబై ఇండియన్స్‌కు చాలా కెప్టెన్సీ ఆప్షన్స్ ఉండటంతో బుమ్రాకు సారథ్య బాధ్యతలు దక్కలేదు. వచ్చే ఏడాది అతనికి కెప్టెన్సీ అవకాశం దక్కితే గొప్పగా రాణిస్తాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతని ప్రదర్శన కాస్త అటు ఇటుగా సాగినప్పటికీ.. అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా.

ఎందుకంటే గుజరాత్ టైటాన్స్‌పై అతను సెంచరీ చేసినప్పుడు.. తొలి 19 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. కానీ చివరి ఐదు ఓవర్లలో అతను గేర్ మార్చిన విధానం చూస్తే.. ప్రపంచంలోని టాప్-3 బ్యాటర్లలో ఒకడిలా కనిపించాడు.

ఓడిపోయే మ్యాచ్‌లో గెలిపించాడు..

ఏ పరిస్థితికైనా తగినట్లుగా మారే అతని శైలి నాకు బాగా నచ్చింది. జట్టు ఏ పాత్రను అప్పగించినా అతను స్వీకరిస్తాడు. నిజానికి ఈ మ్యాచ్ దాదాపు చేజారిపోయే స్థితికి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో ముంబై 50కి పైగా పరుగులు చేయాల్సి వచ్చింది.

అతను సిక్సర్లు బాదాలని అనుకుంటే.. ఎలాంటి బంతినైనా స్టాండ్స్‌లోకి పంపగలడు. కేవలం 10 బంతుల్లోనే 40-50 పరుగులు చేస్తూ.. అంత వేగంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే నైపుణ్యం చాలా తక్కువ మంది ఆటగాళ్లలో ఉంటుంది. కష్ట సమయాల్లోనూ అతను ఎంతో ప్రశాంతంగా ఉంటాడు.

వరల్డ్ క్లాస్ ప్లేయర్..

టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఓపెనింగ్‌ చేయడంతో పాటు, మ్యాచ్‌ను ముగించే ఫినిషర్‌గానూ రాణించగల ఇలాంటి ప్రతిభావంతులు దొరకడం చాలా అరుదు. అతనికి ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం చాలా బాగుంది. ఇది చాలా కష్టమైన ఛేజింగ్ అయినప్పటికీ.. ఎంతో నియంత్రణతో ముగించాడు. 24-25 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతిని ప్రదర్శిస్తున్నాడంటే.. అతని భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతోంది.'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 15, 2026, 17:38 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+