IPL 2026: ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం.. ఆర్‌సీబీకి తప్పని పరాజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 6 పరాజయాల తర్వాత విజయాన్ని అందుకుంది. గురువారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని ఓడించింది.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను అంపైర్లు 19 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది.

మిచెల్ మార్ష్(56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), రిషభ్ పంత్(10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్‌వుడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆర్‌సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు.
అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులే చేసి ఓటమిపాలైంది. రజత్ పాటిదార్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61), దేవదత్ పడిక్కల్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), టీమ్ డేవిడ్(17 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), కృనాల్ పాండ్యా(28 నాటౌట్), రొమారియో షెపెర్డ్(23) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/33) మూడు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications