IPL 2026: పాపం మిచెల్ మార్ష్..!
లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో మిచెల్ మార్ష్ మరో శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్(57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96) సెంచరీ ముంగిట రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఆఖరి ఓవర్‌లో శతకాన్ని పూర్తి చేసుకోవాలనే ఆతృతలో రనౌటయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ మిచెల్ మార్ష్ 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మిచెల్ మార్ష్ శతకం చేజార్చుకోవడంతో ఫ్యాన్స్ అయ్యో పాపం అని కామెంట్ చేస్తున్నారు.
మిచెల్ మార్ష్ శతకం చేజారినా ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. మిచెల్ మార్ష్‌తో పాటు జోష్ ఇంగ్లీస్(60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), రిషభ్ పంత్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యశ్‌రాజ్ పుంజా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలోనే 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
జోష్ ఇంగ్లీస్ ఔటైనా.. నికోలస్ పూరన్(16) నిరాశపర్చినా రిషభ్ పంత్‌తో కలిసి మిచెల్ మార్ష్ చెలరేగాడు. ఆఖరి ఓవర్‌లో మిచెల్ మార్ష్‌కు స్ట్రైక్ ఇచ్చే క్రమంలో పంత్ రనౌట్ కాగా.. ఐదో బంతికి మిచెల్ మార్ష్ రనౌటయ్యాడు. ఆఖరి బంతికి ఆయుష్ బదోని(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications