Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబై, కేకేఆర్ ఔట్.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే?

ఐపీఎల్ 2026 సీజన్‌లో సగం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రతీ జట్టు ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. సెకండాఫ్ టోర్నీలో మ్యాచ్‌లు హోరీహోరీగా ఉండబోతున్నాయి. లీగ్ ఫార్మాట్ ప్రకారం పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్రతీ జట్టు ఏడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తర్వాత పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి.

ఇందులో రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించాయి. పంజాబ్ కింగ్స్ మాత్రం ఓటమెరుగని జట్టుగా టాప్‌లో కొనసాగుతోంది. 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని కూడా ఛేదించి ఆ జట్టు తమకు తిరుగులేదని చాటుకుంది.

IPL 2026 Mid-Season Playoff Qualification Scenarios PBKS RCB and SRH dominate the top 4 spots
Photo Credit: IPL (X)

టాప్-4లో చోటు దక్కాలంటే ప్రతీ జట్టు కనీసం 8 మ్యాచ్‌ల్లో గెలవాలి. 6 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో కొనసాగుతున్న పంజాబ్ చివరి 7 మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మరో మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్.. తమ చివరి 7 మ్యాచ్‌ల్లో 5 గెలవాలి.

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా సీఎస్‌కే తరహాలో మరో 5 మ్యాచ్‌లు గెలవాలి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్ అయితే ఏడు మ్యాచ్‌లకు ఏడు గెలవాలి. అద్భుతం జరిగితే తప్పా ఈ జట్లు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. టోర్నీ ఆరంభానికి ముందు ప్రతీ ఎక్స్‌పర్ట్, ఏఐ టూల్స్ ముంబై ఇండియన్స్ విజేతగా నిలుస్తాయని అంచనా వేసాయి. కానీ ఆ జట్టు చెత్త ఆటతో తీవ్రంగా నిరాశపర్చింది. 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.

ప్రస్తుత పరిస్థితి, టీమ్స్ ఫామ్ పరంగా పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా జట్లు అద్వితీయమైన ప్రదర్శన చేస్తే తప్పా నాకౌట్ చేరే దాఖలాలు కనిపించడం లేదు.

Story first published: Sunday, April 26, 2026, 16:06 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+