Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు టైటిళ్లు అందించినా గుర్తింపు లేదు: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించినా తగిన గుర్తింపు దక్కలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉండటంతో రజత్ పాటిదార్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అభిప్రాయపడ్డాడు.

19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఆర్‌సీబీకి సారథ్యం వహించినా టైటిల్ అందించలేకపోయారు. విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగినా టైటిల్ దక్కలేదు. కానీ రజత్ పాటిదార్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలిపి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్ అందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ రజత్ పాటిదార్ గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడటం లేదు.

IPL 2026 Michael Clarke feels Rajat Patidar Is Underrated Despite Winning Two Consecutive Titles

టీమిండియాలోకి తీసుకోవాలి..

ఇదే విషయాన్ని మైఖేల్ క్లార్క్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 'రజత్ పాటిదార్ మరోసారి సత్తా చాటాడు. అతను స్టార్ క్రికెటర్ కాకపోవడం.. విరాట్ కోహ్లీ జట్టులో ఉండటంతో రజత్ పాటిదార్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ పాటిదార్ కెప్టెన్‌గా ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే అతను వ్యక్తిగతంగా కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు.

శుభ్‌మన్ గిల్.. టీమిండియా నీ అయ్య జాగీరా?

శుభ్‌మన్ గిల్.. టీమిండియా నీ అయ్య జాగీరా?

ప్రస్తుతం రజత్ పాటిదార్‌కు 31 ఏళ్లు. భారత టీ20 జట్టులో చోటు దక్కేలా అతని గురించి చర్చ జరగాలి. రజత్ పాటిదార్ టీమిండియాకు కెప్టెన్ అవుతాడో లేదో నాకు తెలీదు. కానీ, అతనిలో సారథ్యలో లక్షణాలున్నాయి. మిడిలార్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు.

వన్డేల్లోకి కూడా తీసుకోవాలి..

టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. భారత్‌లో ప్రస్తుతం ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఐపీఎల్‌లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు భారత జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. కానీ వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించిన కెప్టెన్‌ను సెలెక్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటారు. టీ20ల్లో పాటీదార్ పేరు ముందుండాలి. వన్డేల్లో కూడా అతన్ని పరిగణలోకి తీసుకోవాలి.'అని మైఖేల్ క్లార్క్ సూచించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో రజత్ పాటిదార్ 192.69 స్ట్రైక్‌రేట్‌తో 501 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ఒంటి చేత్తో ఆర్‌సీబీని గెలిపించాడు.

ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది: సచిన్ టెండూల్కర్

ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది: సచిన్ టెండూల్కర్
Story first published: Thursday, June 4, 2026, 9:45 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+