Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kieron Pollard: ముంబై కోచ్ బలుపు.. కఠిన చర్యలు తీసుకున్న మ్యాచ్ రిఫరీ!

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ నిబంధనలు ఉల్లంఘించడంతో జరిమానా విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన కీరన్ పొలార్డ్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడని, దాంతో మ్యాచ్ రిఫరీ పంకజ్ ధర్మానీ.. కీరన్ పొలార్డ్‌పై చర్యలు తీసుకున్నాడని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

అంపైర్‌ను తిట్టడంతో..

'మ్యాచ్ సమయంలో ఫోర్త్ అంపైర్‌ను ఉద్దేశించి అతనికి వినపడేలా అసభ్యపదజాలం ఉపయోగించినట్లు ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ పై ఆరోపణలు వచ్చాయి. విచారించిన అధికారులు పొలార్డ్‌ను దోషిగా తేల్చారు. అతని అసంతృప్తికి గల నిర్దిష్ట కారణం తెలియదు.

IPL 2026 MI Batting Coach Kieron Pollard Fined 15 Match Fee for Abusive Outburst at Umpire
Photo Credit: X (twitter)

అది వారి జట్టు అంతర్గతంగానే ఉన్నప్పటికీ పొలార్డ్ అంపైర్లపై అసభ్య పదజాలం వాడటం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 కిందకి వస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పొలార్డ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించారు.'అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ముంబైని గెలిపించిన తెలుగోడు..

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై జట్టు.. పంజాబ్ ప్లే‌ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. తిలక్ వర్మ విధ్వంసంతో 201 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ముంబై ఛేదించింది.

Story first published: Friday, May 15, 2026, 13:08 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+