LSG vs DC: ఎంగిడి స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన నికోలస్ పూరన్!(వీడియో)
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడి నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎంగిడి అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా లక్నో డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
లుంగి ఎంగిడి వేసిన ఈ బంతికి నికోలస్ పూరన్ బిత్తరపోయాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఎంగిడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన బంతి అని కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ సందర్భంగా లుంగీ ఎంగిడి వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని గంటకు 112.3 కిలో మీటర్ల వేగంతో ఫుల్‌లెంగ్త్‌లో వేయగా.. బంతిని అంచనా వేయడంలో పూరన్ విఫలమయ్యాడు. బంతి వేగంగా వస్తుందని భావించి ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి నేరుగా వికెట్లను లేపేసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన లుంగి ఎంగిడి అదే జోరును ఐపీఎల్‌లో కూడా కొనసాగించాడు. తొలి మ్యాచ్‌లోనే పూరన్(8)తో పాటు అన్రిచ్ నోకియా(0), మోహ్‌సిన్ ఖాన్(0)లను ఔట్ చేసి మూడు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), అబ్దుల్ సమద్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడితో పాటు నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications