IPL 2026: ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఆదివారం) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడనుండగా.. రాత్రి 7.30 గంటలకు రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. నేటి మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఓడితే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి. మరోవైపు ఆర్‌సీబీ, సీఎస్‌కే ఓడితే ప్లే ఆఫ్స్ సమీకరణం సంక్లిష్టంగా మారుతుంది.

ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఆర్‌సీబీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి. ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే ఆర్‌సీబీ ఆత్మవిశ్వాసం రెట్టింపు కానుంది. ఓడితే మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఒత్తిడిలోకి కూరుకుపోనుంది. అప్పుడు మూడు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టాప్-2 బెర్త్‌ను దక్కించుకోవాలంటే ఆర్‌సీబీకి ఈ విజయం కీలకం.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 4 మ్యాచ్‌ల్లో మూడు గెలవాలి. లక్నో చేతిలో గెలిస్తే సీఎస్‌కే పని ఈజీ అవుతుంది. అలా కాకుండా ఓడితే.. చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ, సీఎస్‌కే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. లక్నో, ముంబై మాత్రం ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వాలనే కసితో ఉన్నాయి.
విరాట్ X రోహిత్..
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నేడు ప్రత్యర్థుల్లా తలపడబోతున్నారు. ఆదివారం మ్యాచ్ కావడం.. ఇద్దరు దిగ్గజాలు పోటీపడుతుండటంతో ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోహ్లీ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 379 పరుగులతో సూపర్ ఫామ్‌లో ఉండగా.. రోహిత్ శర్మ 5 మ్యాచ్‌ల్లో 221 పరుగులతో సత్తా చాటాడు. ఈ రోజు ఈ ఇద్దరిలో అభిమానులను ఎవరు అలరిస్తారో చూడాలి. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications