ఆ టీమ్ ఓనర్.. డ్రెస్సింగ్ రూమ్‌లోనే క్షుద్ర పూజలు చేశాడు: లలిత్ మోదీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చేతబడి(బ్లాక్ మ్యాజిక్) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎస్‌కే ప్లేయర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని నిమ్మకాయతో మంత్రాలు చదివాడు. ఆ వెంటనే శివమ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. మంత్రాలకు చింతకాయలే రాలవు.. వికెట్లు పడ్డాయా? అని కొందరంటే.. చేతబడితో సీఎస్‌కేను ఓడించారని, ఛీటింగ్ అంటూ మరికొందరు సెటైర్లు వేసారు. కొందరైతే ఈ చేతబడిపై సీఎస్‌కే బీసీసీఐకి ఫిర్యాదు చేసిందని ఓ ఫేక్ లెటర్‌ను వైరల్ చేశారు.
ఈ వ్యవహారంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ స్పందించారు. చేతబడి ప్రచారాన్ని ఖండించారు. అయితే ఐపీఎల్ ఆరంభంలో ఇలాంటి మూడనమ్మకాలను ఓ టీమ్ ఓనర్ బాగా నమ్మేవారని బాంబు పేల్చారు. సదరు యజమాని ప్రత్యర్థి జట్టు ఓడిపోవాలని వారి డ్రెస్సింగ్ రూమ్‌లో క్షుద్ర పూజలు చేశాడని ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.

'చేతబడిపై సీఎస్‌కే ఫిర్యాదు చేసిందని వైరల్ అవుతున్న లెటర్ ఫేక్. కానీ గతంలో ఒక జట్టు యజమాని నిజంగానే ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు’అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. ఐపీఎల్ 2011 సీజన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన మరో పోస్ట్‌లో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అప్పుడే సదరు యజమానిని హెచ్చరించానని వెల్లడించారు.
ఈ షాకింగ్ చర్యలకు బాధ్యులైన వారి వివరాలను తన జీవితకథ ఆధారంగా తెరకెక్కే సినిమా లేదా టీవీ సిరీస్ ద్వారా వెల్లడిస్తానని లలిత్ మోదీ తెలిపారు. ఆయన చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. క్షుద్ర పూజలు చేసిన టీమ్ ఓనర్ ఎవరా? నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కావచ్చని కొందరంటే.. చెన్నై సూపర్ కింగ్స్ అని మరికొందరు పేర్కొంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications