IPL 2026: కేకేఆర్‌పై ఢిల్లీ ఘన విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)ను ఓడించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ముంబై ఇండియన్స్‌ను ఓడించడంతో ఈ మ్యాచ్‌కు విలువ లేకుండా పోయింది. 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఈ నామమాత్రపు మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అక్షర్ పటేల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 సిక్స్‌లతో 28) విలువైన పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే(2/28) రెండు వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ అజింక్యా రహానే(39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రోవ్‌మన్ పోవెల్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. రింకూ సింగ్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి (3/27), కుల్దీప్ యాదవ్(3/29) మూడేసి వికెట్లతో.. మిచెల్ స్టార్క్(2/26) రెండు వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
కొంపముంచిన రింకూ సింగ్..
204 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్‌కు మెరుగైన ఆరంభమే లభించింది. దూకుడుగా ఆడే క్రమంలో ఫిన్ అలెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) వెనుదిరిగినా.. అజింక్యా రహానే చెలరేగాడు. మనీష్ పాండేతో కలిసి దూకుడుగా ఆడాడు. కానీ వరుస ఓవర్లలో కేకేఆర్ మనీష్ పాండే, కామెరూన్ గ్రీన్, అజింక్యా రహానే వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన రింకూ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీ హీరో అజింక్యా రహానే, రింకూ సింగ్‌లు వరుస బంతుల్లో ఔటవ్వడంతో కేకేఆర్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. రింకూ బాధ్యతాయుతంగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఈ ఓటమితో కేకేఆర్ ఈ సీజన్‌ను 7వ స్థానంతో ముగించింది. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్ మాత్రమే సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయింది. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications