Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యాతో మంబై ఇండియన్స్ దరిద్రం పోయింది: క్రిష్ శ్రీకాంత్

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చాలా సంతోషంగా కనిపించారని టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ అన్నాడు. హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడంతో ఆటగాళ్ల ఎనర్జీ లెవెల్స్‌లో స్పష్టమైన మార్పు కనిపించిందని, గెలవాలనే పట్టుదల వారిలో కనిపించిందని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరంగా ఉన్నారు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్‌ను నడిపించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయాన్నందించాడు.

ముంబై దరిద్రం పోయింది..

ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో ముంబై దరిద్రం పోయిందని చెప్పుకొచ్చాడు. 'బుమ్రాను కెప్టెన్ చేయడం మంచి నిర్ణయం. ఇదో అద్బుతమైన అడుగు. హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడంతో ఆటగాళ్ల ఎనర్జీ లెవెల్స్‌లో స్పష్టమైన మార్పు కనిపించింది. గెలవాలనే పట్టుదల కనబర్చారు.

IPL 2026 Kris Srikkanth Says Mumbai Indians players are happier when Hardik Pandya is not there

జట్టు అంతా ఒక్కసారిగా మరింత ఐక్యంగా మారినట్లు అనిపించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కారణం ఏదైనా కావచ్చు.. యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఒక్కసారిగా మెరిసింది. దీపక్ చాహర్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఆ రాజ్ బావా కూడా ఫర్వాలేదనిపించాడు. ప్రతి ఒక్కరూ రాణించారు. తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ర్యాన్ రికెల్టన్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను శాసించాడు.

గెలవాలనే కసి కనిపించింది..

గెలవాలనే పట్టుదల, విజయం సాధించాలనే కసి వారిలో కనిపించింది. వారు ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ.. గెలిచి తీరాలనే తపనను ప్రదర్శించారు. క్రికెట్‌లో అదే అత్యంత కీలకం. ఆ ఎనర్జీ జట్టులో స్పష్టంగా కనిపించింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా కూడా మైదానంలో నిరంతరం నవ్వుతూ కనిపించాడు.

బౌలర్లలో అతను ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. బుమ్రా కెప్టెన్సీ దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. అలాగే శార్దూల్ ఠాకూర్ విషయానికొస్తే.. సాధారణంగా అతను లూజ్ డెలివరీలు వేస్తూ పరుగులు ఇస్తుంటాడు. కానీ ఈ రోజు మాత్రం అదరగొట్టాడు. ముంబై బౌలర్లలో ప్రతి ఒక్కరూ వికెట్లు తీశారు.'అని శ్రీకాంత్ విశ్లేషించారు.

ముంబైకి హార్దిక్‌కు గుడ్‌బై..

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ ఖాతాలను అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వెన్ను నొప్పితో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ధర్మశాల మ్యాచ్‌కు రెడీ అయినా బరిలోకి దిగలేదనే వార్తలు వచ్చాయి. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతను పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Story first published: Friday, May 15, 2026, 15:23 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+