Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ ఆడటం చాలా కష్టం: కేకేఆర్ పేసర్

అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ ఆడటం చాలా కష్టమైనదని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) పేసర్, జింబాబ్వే స్టార్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరాబాని అన్నాడు. గతంలో ఆర్‌సీబీ జట్టులో ఉన్నప్పుడు ఐపీఎల్ గేమ్స్ ఎలా సాగుతుందో స్వయంగా చూశానని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్లెస్సింగ్ ముజరాబాని తొలి మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు.

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో అతన్ని కేకేఆర్ తీసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే తరఫున 13 వికెట్లు పడగొట్టాడు. కానీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన ముజరాబాని 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు.

IPL 2026 KKR Pacer Blessing Muzarabani Says IPL is Tougher than International Cricket

తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ముజరాబాని.. ఐపీఎల్ అత్యంత కఠినమైన టోర్నీ అని అభిప్రాయపడ్డాడు. ' ఈ సీజన్‌లో నేను మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నా. ఈ టోర్నీ ఆడటం నాకు చాలా ఇష్టం. ఈ టోర్నీ ఆడే సామర్థ్యం నాకు ఉంది. గతంలో ఆర్‌సీబీ జట్టులో భాగంగా ఉన్న నేను ఈ టోర్నీని నిశితంగా గనమించాను. అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ కష్టతరమైనది. గతేడాది ఆర్‌సీబీలో ఉన్నప్పుడు ఆట ఎలా సాగుతుందో నేను స్వయంగా చూశాను. ఈ ఏడాది.. నేను ఆ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటున్నా.

మా కోచ్ డ్వేన్ బ్రావో ఇప్పటికే నాకు చాలా విషయాలు చెప్పాడు. నేను ఆడటం ప్రారంభించినప్పటి నుంచి, నా బౌలింగ్ గురించి, నాకు ఉండవలసిన నైపుణ్యాల గురించి, ముఖ్యంగా టీ20ల్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, టీ20 క్రికెట్‌ను ఎలా చూడాలి అనే విషయాలపై చాలా సమాచారం ఇచ్చారు. ఈ సీజన్ ముగిసే సమయానికి, నేను ఒక భిన్నమైన బౌలర్‌గా మారుతానని నమ్ముతున్నాను.

భారత ఆటగాళ్లు చాలా కష్టపడతారు. నేను కూడా కష్టపడే స్వభావం కలవాడినే. కానీ వీరు కష్టపడే విధానం, విజయం కోసం వారు చూపే ఆరాటం నాకు సవాలుగా అనిపిస్తోంది. వారు నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నారు'అని ముజరబానీ పేర్కొన్నారు.

Story first published: Wednesday, April 1, 2026, 17:13 [IST]
Other articles published on Apr 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+