Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: రూ.13 కోట్లు.. 15 పరుగులు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. కానీ తృటిలో టైటిల్ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. పేలవ రన్‌రేట్‌తో టాప్-2 ప్లేస్‌ను కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ ధాటికి చేతులెత్తేసింది. కానీ టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా అనామక ఆటగాళ్లు అదరగొట్టడంతో సన్‌రైజర్స్ తిరుగులేని విజయాలు అందుకుంది.

రూ.13 కోట్లు దండుగ..

అయితే కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపర్చారు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ అప్పనంగా రూ. 13 కోట్లు తీసుకొని పోయాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఈ ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను కావ్య మారన్ రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ఫస్ట్ సెట్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచిన లివింగ్ స్టోన్.. తర్వాత అనూహ్యంగా 13 కోట్లు పలికాడు. మరో ఆప్షన్ లేక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ వెటరన్ ప్లేయర్‌పై రూ.13 కోట్లు కురిపించింది. జట్టుకు పనికివస్తాడని భావించి భారీ ధర పెట్టింది. కానీ అతను మాత్రం రెండే రెండు మ్యాచ్‌లు ఆడి 14 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు.

IPL 2026 Kavya Maran Sunrisers Hyderabad SRH Players Price and Performance Analysis

కోట్లు తీసుకొని.. కూసింత ఆడలేదు..

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించగా.. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్‌పై సన్‌రైజర్స్ రూ.3 కోట్లు ఖర్చు చేయగా.. అతను గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

రూ.1.50 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సలీల్ అరోరా కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 159.18 స్ట్రైక్‌రేట్‌తో 156 పరుగులే చేశాడు.

తీసుకుంది కూసింత.. ఆడింది కొండంత..

రూ.30 లక్షల కనీస ధరతో జట్టులోకి వచ్చిన శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన కనబర్చారు. శివాంగ్ కుమార్ 13 మ్యాచ్‌ల్లో 9.62 ఎకానమీతో 9 వికెట్లు తీసాడు. సాకిబ్ హుస్సేన్ 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ప్రఫుల్ హింగే 7 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లతో అదరగొట్టాడు.

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్, ఆర్ సమరణ్, జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్, అనికేత్ వర్మ తీవ్రంగా నిరాశపర్చగా.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా సత్తా చాటారు.


వేలంలో SRH కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.

Story first published: Thursday, June 4, 2026, 10:19 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+