Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కన్నీటి పర్యంతమైన కావ్య మారన్!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగియడంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ సీజన్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. టైటిల్ పక్కా అనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ పరాజయం అనంతరం కావ్య మారన్ తీవ్ర ఆవేదనకు లోనైంది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమైంది.

కాలం ఎంత కఠినం..

తన కన్నీటిని కెమెరాలకు చిక్కకుండా దాచుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కావ్య మారన్‌ను అలా చూసిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. కాలం ఎంత కఠినంగా ఉంటుందనేది కావ్య పాపను చూస్తే అర్థమవుతుందని, పాపం కావ్య మారన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఓవైపు ఓటమి బాధను భరిస్తూనే కావ్యమారన్ మైదానంలోకి దిగి ప్రత్యర్థి జట్టును స్వయంగా అభినందించింది. వైభవ్‌కు స్వయంగా కరచాలనం చేసి మెచ్చుకుంది.

IPL 2026 Kavya Maran Left in Tears as Vaibhav Sooryavanshi s Blitz Knocks SRH Out of the Playoffs
Photo Credit: X (twitter)

వైభవ్ ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(3/54) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), సలీల్ అరోరా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/58) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. యశ్‌రాజ్ పుంజా ఒక వికెట్ తీసాడు.

Story first published: Thursday, May 28, 2026, 9:55 [IST]
Other articles published on May 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+