Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్‌ చాలా బాగా ఆడావ్: SRH ఓనర్ కావ్య మారన్ (వీడియో)

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

ఈ మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన కావ్య మారన్.. వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందించింది. స్వయంగా వచ్చి కరచాలనం చేయడంతో వైభవ్ ఎంతో వినయంగా తలవంచి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కావ్య మారన్ ఇలా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను అభినందించడం చాలా అరుదు. దాంతో ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశమైంది.

IPL 2026 Kavya Maran Appreciates Universe Baby Boss Vaibhav Sooryavanshi After His Epic 97 Destroys SRH

ఈ సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. వైభవ్ ధాటికి కీలక పోరులో చేతులెత్తేసింది. ఈ టోర్నీ ఆసాంతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యాన్ని ఆస్వాదించిన కావ్యమారన్.. నిన్నటి మ్యాచ్‌లో మాత్రం నిరాశగా కనిపించింది. వైభవ్ సూర్యవంశీ ధాటికి ముఖం చాటేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(3/54) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), సలీల్ అరోరా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/58) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. యశ్‌రాజ్ పుంజా ఒక వికెట్ తీసాడు.

Story first published: Thursday, May 28, 2026, 9:39 [IST]
Other articles published on May 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+