IPL 2026: రఫ్ఫాడించిన రబాడ, హోల్డర్.. చిత్తుగా ఓడిన SRH
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 83 పరుగుల భారీ తేడాతో చిత్తు అయ్యింది. ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోగా.. గుజరాత్ టైటాన్స్ రన్ రేట్ రెట్టింపు అయ్యింది. ఈ భారీ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్ 8 విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కూడా దాదాపు ఖరారు చేసుకుంది.
అదరగొట్టిన సాయి, సుందరం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), వాషింగ్టన్ సుందర్(33 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సాకీబ్ హుస్సేన్(2/37), ప్రఫుల్ హింగే(2/17) రెండేసి వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్(1/20) ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాట్ కమిన్స్(19)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/28), జాసన్ హోల్డర్(3/20) మూడేసి వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా.. ప్రసిధ్ కృష్ణ(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్‌కు చెరో వికెట్ దక్కింది.

నిప్పులు చెరిగిన రబాడ, జాసన్ హోల్డర్..
169 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు కూడా చేయలేదు. రబడా వేసిన మరుసటి ఓవర్‌లో సిక్స్ బాది జోరు కనబర్చిన అభిషేక్ శర్మ(6).. నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇషాన్ కిషన్(11) కూడా సిక్స్, బౌండరీతో దూకుడు కనబర్చాడు. కానీ రబాడ మరుసటి ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. పవర్ ప్లే చివరి ఓవర్‌లో స్మరణ్ రవిచంద్రన్(9)ను రబాడ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ హైదారబాద్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత జాసన్ హోల్డర్ సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. కాస్త దూకుడుగా ఆడిన సలీల్ అరోరా(16)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. హెన్రీచ్ క్లాసెన్(14),నితీష్ రెడ్డి(2)లను హోల్డర్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చి సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు.
తన ఆఖరి ఓవర్‌లో హోల్డర్.. శివాంగ్ కుమార్(4)ను ఔట్ చేయగా.. దూకుడుగా ఆడిన కమిన్స్(19)ను ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆఖరి వికెట్‌గా ప్రఫుల్ హింగే(3)ను రషీద్ ఖాన్ స్టంపౌట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications