Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబై, సీఎస్‌కే ఔట్.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందంటే?

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తాజా సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిబాటపట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ రెండు జట్లు ఐదేసి టైటిళ్లతో ఐపీఎల్‌కే ఐకాన్‌గా నిలిచాయి. అలాంటి టీమ్స్ ఇలా ఒకేసారి ప్లే ఆఫ్స్ చేరకుండా వెనుదిరగడం ఐపీఎల్ చరిత్రలోనే ఇది మూడోసారి మాత్రమే.

రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తాజా సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ అత్యంత దారుణ ప్రదర్శన కనబర్చింది. 13 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

IPL 2026 Joins Rare List of Seasons as Five-Time Champions CSK and MI Both Fail to Make the Playoffs

ఆధిపత్యానికి తెర..

ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008 నుంచి చెన్నై, ముంబై జట్లే అత్యధిక సీజన్ల పాటు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ఐపీఎల్ 2022, 2024, 2026లలో మాత్రం ఈ రెండు జట్లు దారుణంగా విఫలమై ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ట్రాన్సిషన్ ఫేజ్. ధోనీ తదుపరి తరాన్ని తయారు చేయడంలో సీఎస్‌కే తడబడుతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో విఫలమై గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకుంది. గాయాల బెడదతో పాటు నిలకడలేమి ఆట ఆ జట్టు పతనాన్ని శాసించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.జట్టు నిండా స్టార్ ఆటగాళ్లున్నా సమష్టిగా రాణించలేక వరుస పరాజయాలను ఎదుర్కొంది. స్టార్ ఆటగాళ్లంతా ఫామ్ కోల్పోవడం ఆ జట్టు పతనాన్ని శాసించింది.

సత్తా చాటిన అనామక జట్లు

ముంబై, సీఎస్‌కే వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన టీమ్స్ కన్నా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి అనామక టీమ్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చాయి. ఉత్తమ ఆటగాళ్ల ఎంపిక, పక్కా ప్రణాళికతో ఈ జట్లు విజయాలు అందుకున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి పేరు ప్రతిష్టల కంటే ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుందనే విషయం మరోసారి స్పష్టమైంది.

Story first published: Friday, May 22, 2026, 23:09 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+