IPL 2026: ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో 16 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచి టోర్నీలో ముందడుగు వేసింది. దాంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే సాధించి 9వ స్థానంలో నిలిచింది.
గెలిపించిన ఆర్చర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 32), యశస్వి జైస్వాల్(17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27), డసన్ షనక(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 29), రవీంద్ర జడేజా(11 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, అల్లా ఘజన్‌ఫర్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. విల్ జాక్స్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/17) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/43), యశ్‌రాజ్ పుంజా(2/44), బ్రిజేష్ శర్మ(2/26) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్చర్ రాజస్థాన్‌ను గెలిపించాడు.
ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్..
206 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ(0) డకౌట్ కాగా.. అతని మరుసటి ఓవర్‌లో నమన్ ధీర్(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక నండ్రే బర్గర్ వేసిన మూడో ఓవర్‌లో ర్యాన్ రికెల్టన్(12) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. బ్రిజేష్ శర్మ ధాటికి తిలక్ వర్మ(3) పెవిలియన్ చేరాడు. దాంతో పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన సూర్య 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన విల్ జాక్స్(33)ను రాజ్ పుంజా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 63 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడినా.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. కానీ అతని జోరుకు ఆర్చర్ బ్రేక్ వేసాడు. ఆ వెంటనే కార్బిన్ బోష్(2) కూడా ఔటవ్వడంతో రాజస్థాన్ రాయల్స్‌కు మూమెంటమ్ లభించింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ కూడా వెనుదిరగడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications